13-08-2025 07:26:02 PM
హైదరాబాద్: టాలీవుడ్ నిర్మాతలు, ఫెడరేషన్ నాయకుల మధ్య చర్చలు ముగిశాయి. సినీ కార్మికుల వేతనాల పెంపు అంశంపై చర్చలు కొలిక్కి రాలేదని ప్రముఖ నిర్మాత దిల్ రాజు పేర్కొన్నారు. మరో రెండు, మూడు సార్లు చర్చలు జరగాల్సి ఉందని, పని విధానాలకు అంగీకరిస్తే వేతనాలు పెంచేందుకు నిర్మాతలు సుముఖం అని అన్నారు. రూ.2 వేలలోపు ఉన్న కార్మికుల వేతనం పెంపునకు ఒక విధానం, రూ.30 వేలకు పైగా తీసుకుంటున్న వారికి మరో విధానం అమలావుతుందని దిల్ రాజు తెలిపారు. ఆదివారం 9-9 కాల్షీట్ అంశంపై చర్చలు కొనసాగుతన్నాయని దిల్ రాజ్ వెల్లడించారు.