calender_icon.png 14 August, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుప్రీం కోర్టు సంచలన తీర్పు నియామకంపై స్టే

14-08-2025 12:52:48 AM

మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ప్రమాణస్వీకారం తప్పు

తదుపరి విచారణ సెప్టెంబర్ 17కు వాయిదా

న్యూఢిల్లీ, ఆగస్టు 13: తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిం ది. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్‌లను ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయడంపై అపెక్స్ కోర్టు స్టే విధించింది. వారి నియామకాలను నిలిపివేస్తూ సుప్రీం తీర్పు నిచ్చింది.

ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ నియమకాలను సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. వీరి నియామకం అక్రమంగా జరిగిందని, విచారణ జరిపి నియామకాన్ని రద్దు చేయాలని కోర్టును కోరారు. దీంతో ఇద్దరి ఎమ్మెల్సీల ఎన్నికపై సుప్రీం స్టే విధించిన సంగతి తెలిసిందే.

దీనిపై బుధవారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని  సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపిక ఉండాలని పేర్కొంటూ గతంలో తాము ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం సవరించింది. మధ్యంతర ఉత్తర్వుల తర్వాత వారు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయ డం తప్పు అని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది.

నాటి బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవ ణ్, కుర్ర సత్యనారాయణలను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా 2023లో బీ ఆర్‌ఎస్ ప్రభుత్వం నామినేట్ చేసింది. అయి తే అప్పటి గవర్నర్ తమిళిపై సౌందరరాజన్ వివి ధ కారణాలతో వారిద్దరి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారు. ఎన్నికల అనంతరం 2023 డిసెంబ ర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2024 జనవరి 13న టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ లను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. వీరి నామినేషన్లనను గవర్నర్ తమిళిసై ఆమోదించారు.

అయితే గవర్నర నిర్ణయంపై హై కోర్టును దాసోజు, సత్యనారాయణ ఆశ్రయించారు. కోదండరాం, అలాఖాన్ ల నియామకాలను హైకోర్టు రద్దు చేసింది. ఆ తరువాత మళ్లీ అవే పేర్లను తిరిగి గవర్నర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సిఫారసు చేసింది. గవర్నర్ ఆమోదంలో కోదండరాం, అమీర్ ఎమ్మెల్సీలుగా నియామకమయ్యా రు.

అయితే తమ నామినేషన్లను తిరస్కరించి..వారిద్దరిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయడంపై  గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకి స్తూ 2024 ఆగస్టు 4న దా సోజు శ్రవణ్, సత్యనారాయణ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ కార్యాలయం కూడా సుప్రీంలో  పిటిషన్ దాఖలు  చేసింది. ఈక్రమంలో 2025 ఆగ స్టు 13న బుధవారం ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. కోదండ రాం, అలీఖాన్‌ల ప్రమాణస్వీకారాన్ని తప్పు పడుతూ వారి నియామకంపై స్టే విధించింది.