calender_icon.png 13 August, 2025 | 8:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోదండరామ్, అలీఖాన్ ప్రమాణస్వీకారాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు

13-08-2025 06:49:12 PM

హైదరాబాద్: ఎమ్మెల్సీలుగా కోదండరామ్, ఆలీఖాన్ ప్రమాణస్వీకారాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. గతంలో గవర్నర్ కోటాలో ఎంపిక చేసిన అభ్యర్థులపై అత్యున్నత న్యాయస్థానం బుధవారం స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపిక ఉండాలని, గతంలో ఇచ్చి మధ్యంతర ఉత్తర్వులను సవరించి తాజాగా మళ్లీ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దాసోజ్ శ్రవణ్ కుమార్, సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సర్కార్ ప్రతిపాదించింది.

కానీ అప్పటి గవర్నర్ దాసోజ్ శ్రవణ, సత్యనారాయణ అభ్యర్థిత్వాలను తీరస్కరించారు. దీంతో వారు గవర్నర్ తీరస్కరణను సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉంటే 2024 జనవరి 13వ తేదీన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోదండరామ్, ఆలీఖాన్ పేర్లను ప్రతిపాదించడంతో గవర్నర్ ఆమోదించారు.  గవర్నర్ నిర్ణయంపై దాసోజ్ శ్రవణ, సత్యనారాయణ హైకోర్టుకు వెళ్లి కోదండరామ్, ఆలీఖాన్ నియామకాలను రద్దు చేయాలని పిటిషన్ దాఖాలు చేశారు. మరోసారి కోదండరామ్, ఆలీఖాన్ పేర్లను గవర్నర్ కు కాంగ్రెస్ ప్రభుత్వం పంపించింది. సర్కార్ అభ్యర్థన మేరకు గవర్నర్ ఆమోదంతో కోదండరామ్, ఆలీఖాన్ ఎమ్మెల్సీలుగా నియమితులయ్యారు. గవర్నర్ నిర్ణయంపై దాసోజ్ శ్రవణ, సత్యనారాయణ 2014 ఆగస్టు 4న సుప్రీంకోర్టును ఆశ్రయించారు.