18-07-2025 01:20:58 AM
టమాటాల కోసం ఎగబడిన జనం.. భారీగా ట్రాఫిక్ జామ్
రాజేంద్రనగర్, జులై 17: టమాటాల లోడ్తో వెళ్తున్న లారీ రాజేంద్రనగర్ డైరీ ఫామ్ చౌరస్తా వద్ద బోల్తా పడింది. శంషాబాద్ నుంచి గుడిమల్కాపూర్ కూరగాయల మార్కె ట్కు వెళ్తున్న సమయంలో లారీ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీ బోల్తా కొట్టడంతో అందులో ఉన్న టమాటాలు మొత్తం రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. అయితే లారీలో ఉన్న రైతులు ఎవరికీ ఏమీ ప్రమా దం జరగలేదు.
టమాటాల కోసం ప్రజలు ఎగబడడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అ య్యింది. ప్రమాద ఘటన సంబంధించిన సమాచారం పోలీసులకు తెలియడంతో సంఘటన స్థలానికి చేరుకున్న క్రేన్ సాయం తో లారీని పక్కకు తీశారు. రోడ్డుపై పడిన టమాటాలను తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చేశారు. డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం వలనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.