18-07-2025 01:22:21 AM
వికలాంగుల ఆసరా పింఛన్దారుల మహాగర్జన
ముషీరాబాద్, జూలై 17(విజయక్రాంతి): పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు ఈనెల 22న అంబర్ పేట మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్ లో ఉదయం 10 గంటలకు వికలాంగుల ఆసరా పింఛన్దారుల మహాగర్జన సన్నాహక సదస్సు విజయవంతం చేయాలని ఎంఎస్పి హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు గజ్జల రాజశేఖర్ మాదిగ అన్నారు.
ఈ మేరకు గురువారం ముషీరాబాద్ నియోజకవర్గం ముషీరాబాద్ డివిజ న్‌లో ముషీరాబాద్ నియోజక వర్గం ఇంచార్జి, ఎంఎస్‌ఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు జన్నపాల మహేష్ మాది గ, రోషిని వినాయక్ రావు మదిగ ఆధ్వర్యంలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగుల సమావేశం నిర్వహిం చారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీహెచ్పీఎస్ కోర్ కమిటీ సభ్యులు, జిల్లా ఇంచార్జి అందే రాంబాబు మాట్లాడుతూ.. కా్ంరxuస్ పార్టీ ఎన్నికల ముందు వికలాంగుల పెన్షన్ రూ. 6 వేలకు, ఇతర చేయూత పెన్షన్ రూ. 4 వేలకు తీవ్ర అంగవైకల్యం గల వారికి పెన్షన్ రూ. 15 వేలకు పెంచుతామని ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రధాన 25 డిమాండ్లు పరిష్కరించాలని ఆగస్టు13 న హైదరాబాద్‌లో వికలాంగుల ఆసరా పించిన్ దారుల మహాగర్జనను విజయవంతం చేయుటకు సిద్ధం కావాలని తెలియజేశారు. ఈ నెల 22న హైదరాబాద్ జిల్లా వీహెచ్పీఎస్ సన్నాహక సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దొరపల్లి దానమ్మ, చిలక ఎల్లయ్య మాదిగ, గజ్జల వినయ్ మాదిగ, ముచ్చనపల్లి రాములు మాదిగ, ఎంఎస్పీ నాయకులు. జెర్రీపోతుల చంద్ర వాసు మాదిగ, ఎమ్మార్పీఎస్ డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.