09-02-2025 08:33:06 PM
పటాన్ చెరు: అక్రమంగా తరలిస్తున్న 24 టన్నుల రేషన్ బియ్యాన్ని కొల్లూరు, ఎస్ వోటీ పోలీసులు సంయుక్తంగా ఆదివారం పట్టుకున్నారు. రాజేంద్రనగర్ నుంచి ముంబై తరలిస్తుండగా కొల్లూరు వద్ద లారీని పట్టుకొని రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. లారీని సీజ్ చేసి కేసు నమోదు చేశారు.