calender_icon.png 22 November, 2025 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా ఎస్పీ పెళ్లి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ దంపతులు..

09-02-2025 08:28:33 PM

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌష్ ఆలం పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ఉన్నతాధికారులు వేడుకల్లో పాల్గొన్నారు. బీహార్ లోని భోదిలో జరిగిన పెళ్లి రిసెప్షన్ వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆయన భార్య నితికా పంత్ తో కలిసి పాల్గొని ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు డీ.ఎఫ్.ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, బోథ్ నియోజకవర్గ కాంగ్రేస్ ఇంచార్జి ఆడే గజేందర్, పలువురు జిల్లా పోలీసులు ఎస్పీని కలిసి పెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు.