09-02-2025 10:18:26 PM
విద్యార్థి నీరజ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ అరుణ..
షాద్ నగర్ (విజయక్రాంతి): షాద్ నగర్ పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు హరి భూషణ్ కుమారుడు పదో తరగతి విద్యార్థి నీరజ్ ఇటీవలే పాఠశాల భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై పాలమూరు ఎంపీ డీకే అరుణ స్పందించారు. ఆదివారం సీఎస్కే వెంచర్ లోని హరి భూషణ్ ఇంటికి ఎంపీ డీకే అరుణ స్థానిక నేత బిజెపి కార్యవర్గ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి తో కలసి భాదితుని నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా హరి భూషణ్ ను పరామర్శించారు. విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఎంతో భవిష్యత్తు కల్గిన విద్యార్థి.... తన మనోభావాలు గాయపడి ఆత్మహత్యకు దారి తీసిన ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నీరజ మృతి తీరనిలోటని ఆమె అన్నారు. హరి భూషణ్ కుటుంబాన్ని ఇలా కలుసుకోవాల్సి వస్తుందని తాను అనుకోలేదని ఎంపీడీకే అరుణ తెలిపారు. అదేవిధంగా పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. నీరజ్ మృతి అత్యంత బాధాకరమని నీరజ్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి హరి భూషణ్ కుటుంబానికి తెలియజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.