23-04-2025 12:00:00 AM
యూపీఎస్సీ ఫలితాల్లో 77 ర్యాంకులు
హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): యూపీఎస్సీ-2024 ఫలితాల్లో హైదరాబాద్‌లోని లా ఎక్సలెన్స్ ఐఎఎస్ అకాడమీ విద్యార్థులు అత్యధిక ర్యాంకులు సాధించారు. లా ఎక్సలెన్స్‌కు 77 ర్యాంకు లు దక్కాయని నిర్వాహకులు తెలిపారు.
వారిలో వందలోపు ర్యాంకులు సాధించిన వారి వివరాలు ఇలా.. రాజ్‌క్రిష్ణ జా 8, ఎట్టబోయిన సాయి శివాణి 11, బన్న వెంకటేశ్ 15, అభిషేక్ శర్మ 38, సచిన్ బసవ రాజ్ గుట్టూరు 41, అవ్ధిజ గుప్తా 43, రావుల జయసింహరెడ్డి 46, చింతకింది శ్రావణ్‌కుమార్ 62, రెడ్డి సాయిచైతన్య జాదవ్ 78, దేవిక ప్రియదర్శిని 95, ఆదిత్య ఆచార్య 96 ఉన్నారు. అలాగే శ్రీనికేశ్ 938, సాయి వినోద్ 577 ర్యాంకులు సాధించారు.