calender_icon.png 8 August, 2025 | 1:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేనేత దుస్తులు ధరించండి

08-08-2025 01:53:51 AM

నూతన డిజైన్లతో చేనేత వస్త్రాలు తయారు కావాలి: కలెక్టర్ విజయేందిర బోయి 

మహబూబ్ నగర్ ఆగస్టు 7 (విజయ క్రాంతి) :  మారుతున్న కాాలానికనుగుణంగా చేనేత డిజైన్ లు అందిస్తూ ప్రతి ఒక్కరు చేనేత వస్త్రాలు ధరించేలా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనిజిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. గురువారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరం లో ఏర్పాటు చేసిన సమావేశం లో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా గద్వాల,నారాయణ పేట,అమరచింత,కొత్తకోట లు చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి గాంచినట్లు ఆమె తెలిపారు.మహబూబ్ నగర్ జిల్లా నుండి కంబళ్ల ను, షాల్స్ ను తయారు చేస్తున్నారని,జిల్లాను కూడా చేనేత ఉత్పత్తులలో ప్రముఖంగా నిలిపేలా కొత్త డిజైన్ లతో చేనేత వస్త్రాలు తయారు చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని తెలిపారు.

చేనేత  కార్మికులు తయారు చేసిన వస్త్రాలను  ధరించాలని,కనీసం వారం కు ఒక రోజు చేనేత వస్త్రాలను ధరించాలని   కోరారు.   మహిళలు మాత్రమే కాకుండా పురుషులు కూడా చేవేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలను ధరించాలని అన్నారు. చేనేత వస్త్రాలను ఎక్కువగా కొనడం వలన అందుబాటులో ధరలు వస్తాయని, చేనేత కార్మికులకు ప్రోత్సాహం ఉపాధి లభిస్తుందని అన్నారు.

రెవెన్యూ అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహ రెడ్డి మాట్లాడుతూ చేనేత వృత్తి కాదు ఒక గొప్ప కళ అన్నారు. గొప్ప కళ అయిన చేనేత వృత్తిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని,చేనేత వస్త్రాలను ధరించి చేనేత కార్మికులకు అండగా నిలువాలని  ఆయన అన్నారు.  నేతన్న పొదుపు,భద్రత కింద 11,48,800 రూ.లు  చెక్కును చేనేత సంఘాలకు అంద చేశారు.

ఈ కార్యక్రమం లో  మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనితా రెడ్డి , జెడ్పి సీఈవోవెంకట రెడ్డి, డి. ఈ. ఓ ప్రవీణ్ కుమార్,డి.పి.అర్. ఓ శ్రీనివాస్,జిల్లా గిరిజన అభివృద్ది అధికారి జనార్ధన్,జిల్లా క్రీడలు,యువజన అధికారి శ్రీనివాస్ ,ఎస్.సి.కార్పొరేషన్ ఈ. ఓ సంతోష్,చేనేత జౌళి శాఖ డి. ఓ రాజేష్ బాబు, ఏ.డి. ఓ లావణ్య,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు