6 July, 2026 | 3:37 PM

Breaking News

శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం   •   టెండర్లు పూర్తికాగానే తాసిల్దార్ కార్యాలయానికి భూమి పూజ   •   ఓటరు జాబితా సవరణపై ఆదివాసి గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ నాయకులు.   •   విజయక్రాంతి వార్తకు స్పందన.. రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •  

గ్రూప్-1పై ఒక నిర్ణయం తీసుకుంటాం: మహేష్ కుమార్ గౌడ్

17-10-2024 03:32 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): గాంధీభవన్ లో గ్రూప్-1 అభ్యర్థులతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చర్చలు జరిపారు. గ్రూప్-1 అభ్యర్థుల సమస్యలను మహేష్ కుమార్ గౌడ్  అడిగి తెలుసుకున్నారు. గ్రూప్-1 పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలని, లేకపోతే జీవో 29 వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని, జీవో 55 అమలు చేయాలని గ్రూప్-1 అభ్యర్థులు డిమాండ్ చేశారు. దీనిపై సానుకులంగా స్వధించిన టీపీసీసీ చీఫ్  సాయంత్రంలోపు గ్రూప్-1పై ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అభ్యర్థుల సమాస్యలపై అధికారులతో మాట్లాడుతామని, అభ్యర్థులు ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత తమదని మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. అటు గాంధీ భవన్ వద్ద అరెస్ట్ చేసిన గ్రూప్-1 అభ్యర్థులని వెంటనే విడుదల చేయాలని మహేష్ కుమార్ గౌడ్ సీఐని కోరారు. కాగా, గ్రూప్-1 అభ్యర్థులు గురువారం ఉదయం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు.