calender_icon.png 17 February, 2026 | 9:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని ప్రాంతాన్ని రాష్ట్రంలోనే అత్యున్నత హంగులతో అభివృద్ధి చేస్తా

17-02-2026 12:43:07 AM

మంథని మున్సిపల్ విజయోత్సవ ర్యాలీలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు

మంథని,ఫిబ్రవరి16 (విజయక్రాంతి): మంథని ప్రాంతాన్ని రాష్ట్రంలోనే అత్యున్నత హంగులతో అభివృద్ధి చేస్తామనిమున్సిపల్ మంథని పట్టణంలో లో విజయోత్సవ ర్యాలీలో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు. సోమవారం మంథని పట్టణంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్లు పాలకవర్గ సభ్యులు సోమవారం మంథని పట్టణంలో పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

ఈ విజయోత్సవ ర్యాలీ కార్యక్రమానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దుల శీను బాబు ముఖ్య అతిథిగా హాజరై పాలకవర్గానికి శుభాకాంక్షలు తె లిపారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయ న పాల్గొన్నారు. ఈ ర్యాలీలో భాగంగా స్వర్గీయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ శ్రీ పాద రావు విగ్రహానికి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి, జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు మంథని ప్రాంతాన్ని రాష్ట్రంలోనే అత్యున్నత హంగులతో అభివృద్ధి పథంలో తీసుకెళ్తారనే నమ్మకంతో ప్రజలు మంథని మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం జరిగిందన్నారు. ఈ విజయానికి అహర్నిశలు కృషి చేసిన నాయకులకు, ప్రతి కార్యకర్తకు, మంథని ము న్సిపల్ ఓటర్లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.