15 April, 2026 | 9:36 AM

క్రీడలతో స్నేహపూరిత వాతావరణం

17-02-2026 12:42 AM

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 

కూకట్‌పల్లి, ఫిబ్రవరి ౧6 (విజయక్రాంతి): క్రీడలతో యువతిలో స్నేహపూరిత వాతావర ణం ఏర్పడుతుందని, క్రీడలు మానసిక ఉల్లా సం కలిగిస్తాయి అని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఎమ్మెల్యే కృష్ణారావు జన్మదినోత్సవం సందర్భంగా  కూకట్‌పల్లి నియోజకవర్గ కార్పొరేటర్లు సమిష్టిగా బాలానగర్ డివిజన్ ఐడిపిఎల్ రాజీవ్ గాంధీ నగర్ క్రికెట్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న ఎంకెఆర్ క్రికెట్ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే మాధవరం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పార్టీ కూకట్‌పల్లి నియోజకవర్గం కార్పొరేటర్‌లు అన్ని డివిజన్‌ల నుంచి 10 టీమ్‌లతో క్రికెట్ మ్యాచులు నిర్వహించడం వలన కార్యకర్తలలో స్నేహపూరిత వాతావరణం నెలకొం టుందన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కార్పొరేటర్లు, బిఆర్‌ఎస్ నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.