calender_icon.png 15 November, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాక్టర్ బోల్తా – డ్రైవర్ దుర్మరణం

15-11-2025 12:38:10 AM

అశ్వాపురం,(విజయక్రాంతి): అశ్వాపురం మండలం గొందిగూడెం గ్రామంలోని పాత ఎల్ అండ్ టి క్రషర్ వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ దుర్మరణం చెందాడు. బిజీ కొత్తూరు ప్రాంతంలోని ఇటుక భట్టిలో చెరుకూరి శ్రీనివాస్ వద్ద పనిచేస్తున్న ఒడిశాకు చెందిన జిత్తు పాత్ర అనే వ్యక్తి ట్రాక్టర్‌ను నడుపుకుంటూ గొందిగూడెం వైపు వస్తుండగా వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో జిత్తు పాత్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద సమాచారం అందుకున్న అశ్వాపురం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.