15-11-2025 12:39:05 AM
చిట్యాల, నవంబర్ 14(విజయ క్రాంతి) : ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఒక వరమని, లబ్ధిదారులకు చెక్కును అందజేస్తూ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం తెలిపారు.
చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన పాలకూరి ఇందిర భర్త చంద్రయ్య ఇటీవల అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స పొందగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు 10,500లను ఆయన లబ్ధిదారులకు అందజేశారు.
మార్కెట్ డైరెక్టర్ కోనేటి యాదగిరి, మాజీ ఎంపీటీసీ పోలగోని స్వామి, సీనియర్ నాయకులు పల్లపు బుద్ధుడు, మాజీ ఉప సర్పంచ్ ఉయ్యాల లింగయ్య, జనపాల శ్రీను, బొడ్డు శ్రీను, గుత్తా రవీందర్ రెడ్డి, అనంతుల శంకర్ మరియు తదితరులు పాల్గొన్నారు.