calender_icon.png 9 May, 2025 | 8:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

18న ఢిల్లీలో ట్రేడ్ యూనియన్ సదస్సు

14-03-2025 01:16:09 AM

మంచిర్యాల, మార్చి 13 (విజయక్రాంతి) : ఏప్రిల్ 1 నుంచి బిజెపి ప్రభుత్వం అమలు చేయనున్న నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న డిల్లీలో ట్రెడ్ యూనియన్ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఏఐటీయుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు అన్నారు.

గురువారం సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నాలుగు లేబర్ కోడ్ లు అమలయితే కేవలం బడా పారిశ్రామికవేత్తలు కార్పొరేట్ అధిపతులకు వారి వ్యక్తిగత ఆదాయం పెరగడం కోసం మాత్రమే దోహద పడతాయన్నారు. 44 కార్మిక చట్టాలను అమలు చేయాలి.

కార్మికులకు కంటే కార్పొరేట్లకే బిజెపి ప్రభుత్వం లాభం చేకూర్చే దిశగా అడుగులు వేస్తుందంటే అతిశయోక్తి కాదని ఏఐటీయుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు అన్నారు. బిజెపి ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 కోడ్ లుగా మార్చిందని, దీనితో కార్మికులు ప్రాథమిక హక్కులు కోల్పోతారన్నారు.

టైమ్ బాండ్ ఎంప్లాయ్ మెంట్ అమల్లోకి వస్తుందన్నారు. 8 గంటల పని విధానం రద్దు చేయనున్నారని, సంఘం పెట్టే హక్కు లేకుండా, వేతన పెరుగుదల లేకుండా , బోనస్ యాక్ట్ లేకుండా చేసే ఈ 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిల్లీలో ఈ నెల 18న నిర్వహించే సదస్సును విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు ఖలిందర్ ఆలీ ఖాన్, మిట్టపల్లి పౌలు, దొడ్డిపాట్ల రవీందర్, సిరికొండ రాయమల్లు పాల్గొన్నారు.