calender_icon.png 9 May, 2025 | 11:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికల్ హబ్‌గా జగిత్యాల జిల్లా

14-03-2025 01:16:35 AM

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ 

జగిత్యాల అర్బన్, మార్చి 13 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల తో పాటు నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో పల్లె, దావాఖానాలు ఎక్కువగా మంజూరయ్యాయని దీంతో జగిత్యాల జిల్లా మెడికల్ హబ్ గా మారుతుందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం తక్కలపల్లి గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో భాగంగా రు.20 లక్షలతో నిర్మించనున్న పల్లె దవాఖాన నిర్మాణపనులకు స్థల పరిశీలన చేసి, పల్లె దావఖాన నిర్మాణానికి భూమి దానం చేసిన హనుమాన్ రెడ్డిని ఎమ్మెల్యే సత్కరించారు. అనంతరం హనుమాజీపేట్ బాలపెళ్లి గ్రామాల మధ్య రు.31 లక్షల 50 వేలతో నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక పల్లె దావఖానాలు జగిత్యాల నియోజకవర్గానికి మంజూరయ్యాయని దీనితో జగిత్యాల జిల్లా నేడు మెడికల్ హబ్ గా మారిందన్నారు. మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేయడానికి కృషిచేసి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడానికి కృషి చేస్తానన్నారు.రోడ్డు ప్రమాద బాధితులకు అవసరమైన క్రిటికల్ కేర్ యూనిట్ కూడా పూర్తి కావచ్చిందన్నారు.గ్రామస్తులు పల్లె దావఖాన ద్వారా టీకాలు వేసుకోవాలని కోరారు,వారి సేవలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

వెల్దుర్తి గ్రామంలో పశువుల దావఖాన అభివృద్ధికి రు.12 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు.జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో అదనంగా 320 పడకల ఆసుపత్రికి పూర్తి చేయడానికి నిధులు మంజూరయ్యాయని, త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ముస్కు ఎల్లారెడ్డి, దశరథరెడ్డి, బాల ముకుందం, రవీందర్ రెడ్డి, విక్రమ్, కృష్ణ, సతీష్, నరేష్, శంకర్, ప్రవీణ్ రావు, మోహన్ రెడ్డి, వెంకటేష్, మాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఉప సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.