calender_icon.png 29 October, 2025 | 3:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుఫాన్ ఎఫెక్ట్.. ఐటీ కారిడార్‌లో భారీ ట్రాఫిక్ జామ్‌

29-10-2025 01:13:21 PM

హైదరాబాద్: 'మొంథా' తుఫాను కారణంగా నగరంలోని ప్రధాన రహదారులపై తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఐటీ కారిడార్‌లోని(Hyderabad's IT corridor) అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. 'భారీ రద్దీ కారణంగా గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై బయోడైవర్సిటీ జంక్షన్ వైపు ట్రాఫిక్ నెమ్మదిగా ఉంది. ట్రాఫిక్ సిబ్బంది అక్కడే ఉన్నారు. ప్రవాహాన్ని తగ్గించడానికి పరిస్థితిని చురుగ్గా పర్యవేక్షిస్తున్నారు. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని, సాధ్యమైన చోట ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి,అప్రమత్తంగా ఉండండి!' అంటూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎక్స్ లో పోస్ట్ చేశారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ట్రాఫిక్ జామ్‌లలో ప్రయాణికులు చిక్కుకుపోయారు. దీంతో ఆఫీసులకు సమయం కంటే రెండు గంటల తర్వాతే తమ కార్యాలయాలకు చేరుకోగలిగారు. తుఫాన్ ప్రభావం నగరం అంతటా కనిపించింది. తుపాన్ ఎఫెక్ట్ ప్రజా రవాణా సేవలపై కూడా ప్రభావితం చూపింది.

హైదరాబాద్ నగరంతో నిన్న సాయంత్రం ప్రారంభమైన వర్షం ఇప్పటికి కురుస్తునే ఉంది. ఆఫీసులకు వెళ్లేవారు, పాఠశాలలు, కళాశాలలకు వేళ్లే విధ్యార్థులు వర్షం వల్ల తీవ్ర ఆలస్యంతో ఇబ్బంది పడ్డారు. ఉదయం 7 గంటల నుంచే నగరంలోని మెట్రో స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. 11 గంటల తర్వాత కూడా కొనసాగాయి. ఎంజీబీఎస్, సికింద్రాబాద్, నాంపల్లి, బేగంపేట, లింగంపల్లి రైల్వే స్టేషన్లు, హైటెక్ సిటీ, మియాపూర్, రాయదుర్గం మెట్రో స్టేషన్లలో ప్రయాణికులు, కార్యాలయాలకు వెళ్లేవారి రద్దీ భారీగా ఉంది. ఎల్‌బీ నగర్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, అబిడ్స్, కోఠి, సికింద్రాబాద్, ప్యారడైజ్, బేగంపేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపుల్, కూకట్‌పల్లి, నిజాంపేట్, మదీనగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, మియాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా చాదర్‌ఘాట్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. పరిస్థితిని అదుపు చేయడానికి బృందాలను రంగంలోకి దింపినట్లు అధికారులు పేర్కొన్నారు.