29-10-2025 02:41:34 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ (BSP) జిల్లా ఇంఛార్జీలను బిఎస్పి (BSP) తెలంగాణ చీఫ్ ఇబ్రామ్ శేఖర్ (SHEKAR) నియమించారు. మంచిర్యాల జిల్లా ఇన్చార్జిలుగా ధాగం శ్రీనివాస్ (DHAGAM SRINIVAS), నాగుల కిరణ్ బాబు (NAAGULA KIRAN BABU) లకు బుధ వారం నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ (BSP) తెలంగాణ రాష్ట్ర కో ఆర్డినేటర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ నిషాని రామచంద్రం, కోఆర్డినేటర్ దాగిల్ల దయానంద్ రావు, రాష్ట్ర నాయకులు కాదాశి రవీందర్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.