29-10-2025 02:44:20 PM
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం పత్తిపాడు-ఏన్కూరు మార్గంలో జన్నారం వద్దగల నిమ్మ వాగులో వరద ఉధృతికి కొట్టుకుపోయిన డీసీఎం వ్యాన్. ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులో వరద ఉధృతి పెరిగింది. ఆ మార్గంలో ప్రయాణిస్తున్న డీసీఎం వ్యాన్ వాగులో దిగడంతోనే వరద ఉధృతంగా రావడంతో కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ గల్లంతయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.