13-01-2026 02:07:16 PM
రుణమాఫీ, రైతుభరోసా ఎప్పుడంటూ.. ప్లెక్సీలు ప్రదర్శన
హైదరాబాద్: సిద్దిపేట జిల్లా(Siddipet District) దుబ్బాకలో మంత్రి వివేక్ వెంకటస్వామి(Minister Vivek Venkataswamy) కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. వివేక్ వెంకటస్వామి కార్యక్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వివేక్ మంగళవారం నాడు దుబ్బాక పురపాలక పరిధి ధర్మాజీపేటవార్డులో పర్యటించారు. బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) శ్రేణులు మంత్రి వివేక్ కార్యక్రమంలో ఫ్లెక్సీలు ప్రదర్శించారు. రుణమాఫీ, రైతుభరోసా ఎప్పుడు చేస్తారంటూ బీఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ఫ్లెక్సీలు ప్రదర్శించిన బీఆర్ఎస్ నేతలతో కాంగ్రెస్ నేతలు గొడవ పడ్డారు. నిరసన తెలిపిన వారికి వద్దకు మంత్రి వివేక్ స్వయంగా వెళ్లారు. అర్హులైన రైతులందరికీ న్యాయం చేస్తామని నచ్చజెప్పారు. దీంతో వివాదం సద్దుమణిగింది.