30-07-2025 10:43:03 PM
ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న
హుజూర్ నగర్: కార్మికుల కోసం ఐఎన్టీయూసీ నిరంతరం కృషి చేస్తుందని ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న(INTUC State General Secretary Yaragani Naganna) అన్నారు. బుధవారం పట్టణంలోని బైరు బాలయ్యతో పాటు పలువురు కార్మికులు ఐఎన్టీయూసీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్మికుల అభ్యున్నతకై విశేష కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నియోజకవర్గ అధ్యక్షులు బెల్లంకొండ గురువయ్య,మండల అధ్యక్షులు మేళ్ళచెరువు ముక్కంటి, చిట్యాల అమర్నాథ్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు పాశం రామరాజు, సలిగంటి జానయ్య, మేకపోతుల వీరబాబు, సోమగాని బాలక్రిష్ణ, తదితరులు, పాల్గొన్నారు.