4 April, 2026 | 3:52 AM

కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు

04-04-2026 02:18 AM

ఆదివారం ‘వన్ వే’ ట్రయల్ రన్

జూబ్లీహిల్స్, ఏప్రిల్ 3(విజయక్రాంతి): నగరంలోని బంజారాహిల్స్.. జూబ్లీహిల్స్ పరిధిలో ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం చేపట్టిన హెచ్-సిటీ మౌలిక సదుపాయాల పనులు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా ప్రతిపాదిత స్టీల్ ఫ్లైఓవర్, అండర్పాస్ నిర్మా ణ పనుల దృష్ట్యా ఈ ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు వన్ వే ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఈ రెండు గంటల పాటు కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల రహదారులన్నీ ఏకపక్ష మార్గాలుగానే పని చేస్తాయని జాయింట్ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) జోయల్ డేవిస్ వెల్లడించారు.

ఎన్‌ఎఫ్‌సిఎల్ నుంచి ఎస్‌ఎన్ టి, సాగర్ సొసైటీ మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నెం. 36, 45, కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్లే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని జోయల్ డేవిస్ సూచించారు. అటువంటి వాహనదారులు ఎన్డీఆర్ భవన్ వద్ద ఎడమ మలు పు తీసుకుని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, అగ్రసేన్ ఐలాండ్ మీదుగా ఒమేగా హాస్పిటల్ చేరుకోవాలన్నారు. అక్క డి నుండి రోడ్ నెం. 45 లేదా ఐకియా వైపు తమ ప్రయాణాన్ని కొనసాగించవచ్చన్నారు.

ఈ మార్పు ల వల్ల ప్రయాణ సమయంలో కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉన్నందున వాహనదారులు ముం దస్తుగా తమ ప్రయా ణం ప్లాన్ చేసుకోవాలన్నారు. అలాగే యూ సుఫ్‌గూడ, శ్రీనగర్ కాలనీ నుంచి మాదాపూర్, జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వారు ఇందిరానగర్ గడ్డ రోడ్ (రోడ్ నెం. 5) ద్వారా వెంకటగిరి జంక్షన్ చేరుకుని, అక్కడ కుడి మలుపు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అనంతరం డైమండ్ హౌస్, రోడ్ నెం. 10 మీదుగా అల్-కాజర్ చేరుకుని, మళ్లీ కుడి మలుపు తీసుకోవడం ద్వారా నీరూస్ జంక్షన్, రోడ్ నెం. 36కి చేరుకోవచ్చన్నారు. ట్రయల్ రన్ సమయంలో ఈ మార్గాల్లో ఎక్కడా యు-టర్న్ తీసుకోవడానికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు.

ప్రయాణికులు తమకు కేటాయించిన ఎగ్జిట్ పాయింట్ల వద్ద నిష్క్రమిం చడానికి వీలుగా ఎల్లప్పుడూ రోడ్డు కు ఎడ మ వైపునే ప్రయాణించాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు వాహనదారులు క్షేత్రస్థాయిలో ఉండే పోలీసుల సూచ నలను, అక్కడ ఏర్పాటు చేసిన సైనేజ్ బోర్డులను తప్పనిసరిగా అనుసరించాలన్నారు. గూగుల్ మ్యాప్స్ వంటి నావిగేషన్ యాప్ల ద్వారా రియల్ టైమ్ ట్రాఫిక్ అప్డేట్స్ గమనిస్తూ ప్రయాణించడం ఉత్తమమని తెలియ జేశారు. వీలైనంత వరకు కార్ పూలింగ్, ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకోవాలని, భారీ వాహనాలు ఈ సమయంలో ఈ రూట్లలో రాకుండా చూసుకోవాలని కోరారు. నగర అభివృద్ధి కోసం జరుగుతున్న పనులకు ప్రజలు సహకరించాలన్నారు.