రైతాంగ పోరాటంలో దొడ్డి కొమరయ్య పాత్ర కీలకం
ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
సంగారెడ్డి, ఏప్రిల్ 3: దొడ్డి కొమరయ్య త్యాగం తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సిం హ పేర్కొన్నారు. రైతుల హక్కుల కోసం, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన ధైర్యసా హసాలు నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నా రు. దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా శుక్రవారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వ ర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి, జి ల్లా కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోతిరెడ్డిపల్లిలోని దొడ్డి కొమరయ్య విగ్రహానికి మంత్రి, కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ, సామాజిక న్యాయం, సమానత్వం కోసం దొడ్డి కొమరయ్య చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని, ఆయన స్ఫూర్తితో ప్రజాసేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దొడ్డి కొమరయ్య వంటి మహనీయుల ఆశయాలను సాకారం చేయడం ద్వారానే సమా జంలో నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ ఉద్యమానికి నాంది పలికిన అమరవీరుడు, రైతాంగ గళంగా నిలిచిన గొప్ప నాయకుడు దొడ్డి కొమరయ్య అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, సంగారెడ్డి, ఇస్నాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ లు కూన వనిత, సుమలత శ్రీకాంత్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి జగదీశ్, కురుమ సంఘం జిల్లా అధ్యక్షులు గడ్డం మల్లయ్య, జనరల్ సెక్రటరీ తాటిపల్లి పాండు, బీసీ సంఘం యూత్ ప్రెసిడెంట్ రమేష్ కుమార్, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.




