23 April, 2026 | 6:20 AM

నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

10-05-2024 12:58 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 9 (విజయక్రాంతి) : నగరంలోని ఎల్బీ స్టేడియంలో నేడు బీజేపీ ఆధ్వర్యంలో ఎన్నికల సభ జరగనుంది. సభకు ముఖ్యఅతిథిగా ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానున్న నేపథ్యంలో ఎల్బీస్టేడియం పరిసరాల్లో శుక్రవారం సాయంత్రం 4గంటల నుంచి 8గంటల వర కు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర ట్రాఫిక్ ఏసీపీ తెలిపారు. ఈ క్రమంలో బేగంపేట్ ఎయిర్‌పోర్టు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట ఫ్లుఓవర్, మోనప్ప ఐలాండ్ జంక్షన్, యశోదా హస్పిటల్, రాజ్‌భవన్, ఖైరతాబాద్ ఫ్లుఓవర్, ఎన్టీఆర్ మార్గ్, తెలుగుతల్లి జంక్షన్, ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జంక్షన్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. అలాగే నాంపల్లి, బషీర్‌బాగ్, బీజేఆర్ స్టాచ్యూ, ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ, నాంపల్లి స్టేషన్ రోడ్డు, లతీఫ్ ఖాన్ బిల్డింగ్, సుజాత స్కూల్ జంక్షన్, లిబర్టీ, హిమాయత్‌నగర్, అసెంబ్లీ, ఎంజే మార్కెట్, హైదర్ గూడ వద్ద వాహనాలను మళ్లించనున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీసులకు సహకరించాలని కోరారు.