22-10-2025 01:46:13 PM
మంథని,(విజయక్రాంతి): మంథని మాజీ సర్పంచ్ వోడ్నాల శ్రీనివాస్ తండ్రి వోడ్నాల చిన్నమల్లయ్య ఇటీవల కాలుకు గాయం కావడంతో ఆపరేషన్ చేసుకొని ఇంట్లో బాధపడుతుండగా, బుధవారం గాంధీచౌక్ లోని వారి నివాసంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు పరిమర్శించారు. మల్లయ్య ఆరోగ్యం గురించి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ ను అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడద్దని త్వరలోనే కోలుకుంటారని మల్లయ్యకు నాయకులు ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, పిఎసిఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఏఎంసీ చైర్మెన్ కుడుదుల వెంకన్న, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అజీమ్ ఖాన్, మాజీ సర్పంచులు జనగామ నర్సింగరావు, చెంద్రు రాజమల్లు, ఎలుకల మధు, నాగుల రాజయ్య, మాజీ ఎంపీటీసీ ఉదరి లచ్చన్న, అక్కపాక సదయ్య, మంథని శ్రీనివాస్, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.