22-10-2025 01:55:19 PM
హాజరు శాతం పెంచేందుకు ప్రయత్నాలు
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు సిబ్బంది విద్యార్థుల చెంతకు వెళ్లారు. ఆ శాఖ ఆదేశాల మేరకు విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు ఎప్పటికప్పుడు నమోదు చేయాల్సిన అవసరం ఉండగా ఇక్కడ కళాశాల విద్యార్థులు పలు గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు తరగతులకు హాజరు కావడం లేదని, ఉపాధ్యాయుల బృందం స్వయంగా బుధవారం కళాశాల ప్రిన్సిపల్ ఆనందం ఆదేశాల మేరకు గ్రామాల్లో విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రతిరోజు కళాశాలకు పిల్లలను పంపించాలని కౌన్సిలింగ్ చేశారు.