calender_icon.png 22 October, 2025 | 5:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అష్ఫాకుల్లా ఖాన్ జయంతి వేడుకలు

22-10-2025 01:51:46 PM

ఘనంగా అశ్వకుల్లాఖాన్ జయంతి వేడుకలు

మందమర్రి,(విజయక్రాంతి): ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు అష్ఫాకుల్లా ఖాన్ జయంతి వేడుకలు మాజీ ఆర్మీ జవాన్ రాజేష్ కుమార్ పివ్హాల్ - రాణి పివ్హాల్ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సింగరేణి హైస్కూల్లో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అష్ఫాకుల్లా ఖాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు  పురుషోత్తం మాట్లాడుతూ... అక్టోబర్ 22, 1900  సం.లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షాజహాన్ పూర్ ముస్లిం కుటుంబంలో జన్మించి చిన్న వయసులోనే దేశభక్తి భావాన్ని పెంపొం దించుకొని స్వాతంత్ర పోరాటంలో ఆసక్తిని పెంచుకోవడంతో పాటు  మహాత్మా గాంధీ చేపట్టిన  సహాయ నిరాకరణ ఉద్యమంతో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు.

చిన్నతనం నుండే దేశ స్వాతంత్య్రం కోసం వీరోచితంగా పోరాడి దేశ వీర మరణం పొందారని ఆయన సేవలను కొనియాడారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుండి దేశభక్తిని పెంపొందించు కోవడంతో పాటు స్వాతంత్ర సమర యోధులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం రాజేష్ కుమార్ పివ్హాల్ మాట్లాడుతూ విద్యార్థులలో దేశభక్తి భావాన్ని పెంపొందించే లక్ష్యంతో పాఠశాలలో స్వాతంత్ర సమరయోధుల, మహనీయుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగు తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఎం జీవన్, పి తిరుపతి, జి దేవమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు.