calender_icon.png 22 October, 2025 | 5:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి.. పంటలకు నీళ్లు ఇస్తాం: మంత్రి పొన్నం

22-10-2025 02:11:14 PM

వరి, మొక్కజోన్న కొనుగోలు చేస్తాం: మంత్రి పొన్నం

హైదరాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో(Husnabad Constituency) కొండా పూర్ దగ్గరలోని గోమాత పత్తి మిల్లులో పత్తి  కొనుగోలు(Cotton Purchasing Center) కేంద్రాన్ని, హుస్నాబాద్ లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మక్కల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) బుధవారం నాడు ప్రారంభించారు. పత్తిలో తేమ శాతాన్ని పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. కపాస్ కిసాన్ మొబైల్ యాప్ ద్వారా పత్తి కొనుగోళ్లు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. జిన్నింగ్ మిల్లు ఉన్న కొనుగోలు కేంద్రంలో తేదీ స్లాట్ ఇస్తారని వివరించారు. పత్తికి ప్రస్తుతం రూ. 8,100 మద్దతు ధర ఉందని తెలిపారు. రైతుల నుంచి వరి, మొక్కజోన్న కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. ఆయిల్ పామ్, హార్టికల్చర్, సెరీకల్చర్ పై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని మంత్రి పొన్నం తెలిపారు. త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టు(Gauravelli Project) పూర్తి చేసి పంటలకు నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజోన్నకు మద్దతు ధర రూ, 2,400 ఉందని మంత్రి వెల్లడించారు.