18 April, 2026 | 1:47 PM

బాలానగర్ ఆసుపత్రిలో విషాదం

01-06-2025 12:11 AM

సిజేరియన్ అనంతరం తల్లి, శిశువు మృతి

కూకట్‌పల్లి, మే 31: బాలానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. కేపీహెచ్‌పీ కాలనీ 4వ ఫేజ్‌కి చెందిన గర్భిణి అరుణ(22) శనివారం ఉదయం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేరింది. డాక్టర్లు సిజేరియన్ చేయగా మగ బిడ్డకు జన్మనిచ్చింది.

అనంతరం అరుణ బెడ్ మీద పడిపోవడంతో ఆసుపత్రి సిబ్బంది 108 అంబులెన్సులో గాంధీ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అప్పుడే పుట్టిన మగ బిడ్డను చికిత్స కోసం నీలోఫర్ ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తుండగా శిశువు కూడా మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. బాలానగర్ పోలీస్ స్టేషన్‌లో కుటుంబీకులు ఫిర్యాదు చేశారు.