calender_icon.png 4 June, 2025 | 7:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయాభివృద్ధికి కృషి చేయాలి

01-06-2025 12:11:47 AM

-పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ 

-ప్రమాణ స్వీకారం చేసిన ఆలయ పాలకమండలి

ఎల్బీనగర్, మే 31 : కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయ అభివృద్ధికి నూతన పాలకమండలి కృషి చేయాలని పాలక మండలి సభ్యులకు టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, రాష్ట్ర రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి సూచించారు.

ఇటీవల చంపాపేట డివిజన్ పరిధిలోని కార్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయపాలక మండలి కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శనివారం హనుమాన్ ఆలయంలో పాలక మండలి సభ్యులు దిండు ప్రవీణ్ గౌడ్, తోకటి కిరణ్, సింగంశెట్టి శ్రీనివాస్, విష్ణువర్ధన్ రెడ్డి, నారాయణ, దుర్గారెడ్డి, కుకునూరి గోపాల్ రెడ్డి, పూల నాగరాజు, కవిత, ఓరుగంటి నరేశ్, కొండ్ర సంతోష్ కుమార్, బండి గారి శ్రీనివాస్ గౌడ్, అనుముల రవీందర్ రెడ్డి, ఈదులకంటి సత్యనారాయణ రెడ్డి ప్రమాణ స్వీకారాన్ని ఆలయ కార్యనిర్వాహణాధికారి లావణ్య సమక్షంలో చేపట్టారు.

ముఖ్య అతిథులుగా టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, రాష్ట్ర రోడ్డు డెవలాప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కాల్వ సుజాత,  హాజరై నూతన పాలకమండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ... కర్మన్ ఘాట్ ధ్యాన ఆంజనేయ ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచిందన్నారు. ఆలయ పాలకమండలి సభ్యులంతా సమిష్టి నిర్ణయాలు తీసుకుని ఆలయాభివృద్ధికి కృషి చేయాలని  సూచించారు.

ఆలయాభివృద్ధికి ప్రభుత్వంతోపాటు తాను సైతం సహకరిస్తానని మధుయాష్కీ గౌడ్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఆల య మాజీ చైర్మన్ నల్ల రఘుమారెడ్డి, కార్పొరేటర్లు రాజశేఖర్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కనీస ఏర్పాట్లు చేయని ఆలయాధికారులు 

నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారానికి ఆలయాధికారులు ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారు. నూతన సభ్యులకు సైతం కూర్చోవడానికి కూర్చీలు వేయించలేదు. కొందరు సభ్యులు చాలా సమయం వరకు నిలబడే ఉన్నారు. వచ్చిన అతిథులు కూడా నిలబడే ఉన్నారు. ప్రమాణ స్వీకారం చూడడానికి వచ్చినవారు స్థలం లేకపోవడంతో బయటే ఉన్నారు.