పెళ్లి ఇంట్లో విషాదం
చేగుంట ఏప్రిల్ 28: చేగుంట మండలంలో పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. చేగుంట మండలం, చిట్టోజిపల్లి గ్రామంలో యువకుడు చాకలి రమేష్ (19) బావిలో పడి చనిపోయారు. రమేష్ చెల్లెలి పెళ్లి జరగ్గా, విందుకు వెల్లాల్సి ఉంది. ఈ క్రమంలో స్నానం కోసం ఊరి సమీపంలోని కృష్టశామల వ్యవసాయ భూమిలో గల, (ఫామ్ పౌండ్)నీటి స్టోరేజీ గుంతలో స్నానం చేయుటకు వెళ్లిన రమేష్.. కాలుజారి అందులో పడి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు.
వేడుకలు జరగాల్సిన ఇంట్లో మరణవార్త తెలియడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న చేగుంట పోలీసులు సంఘటన స్థలా నికి చేరుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, తల్లి చాకలి నర్సవ్వ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చేగుంట ఎస్త్స్ర చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు.






