23 April, 2026 | 2:34 AM

డాక్రా మహిళలకు యూనిఫామ్ కుట్టడంపై శిక్షణ కేంద్రం

23-04-2026 01:07 AM

ఎల్లారెడ్డి, ఏప్రిల్ 22(విజయ క్రాంతి):  ఎల్లారెడ్డి మండల కేంద్రంలో నాణ్యమైన స్కూల్ యూనిఫామ్ కుట్టుటకు శిక్షణ కేంద్రాన్ని బుధవారం జిల్లా డి ఆర్ డి ఓ అధికారి విజయలక్ష్మి చేతుల మీదుగా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం ఏపీఎం రామ్ నారాయణ గౌడ్ తో కలిసి ఆమె మాట్లాడారు  డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులకు ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట్ లింగంపేట్ నిజాంసాగర్ మండలాలకు సంబంధించి ఒక మండలానికి 40 మంది చొప్పున ఒక బ్యాచ్ కు నాలుగు రోజుల పాటు శిక్షణ ఇస్తారని తెలిపారు.

ఒక్కొక్క మండలానికి 40 మంది మహిళా సంఘాల సభ్యులకు నాలుగు రోజులపాటు శిక్షణ ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీపీఎం నాన్ ఫామ్ సాయిలు , డి పి ఎం ఐబి శ్రీనివాస్  ఏపిఎం రామ్ నారాయణ గౌడ్  మండల సమాఖ్య అధ్యక్షులు పావని ,టీజీ  ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిల్ కోఆర్డినేటర్ సాయిల్ శిక్షణను అందించే ఇన్స్ట్రక్టర్ , విజయలక్ష్మి ఐకెపి సీసీలు మహేష్, సుజాత,, గోపాల్ మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.