కౌన్సిలర్లకు శిక్షణ తరగతులు
24-07-2026 12:00 AM
మేడ్చల్ అర్బన్ జూలై 23(విజయక్రాం తి): హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో ఎల్లంపేట్ మున్సిపల్ కౌన్సిలర్ లకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని మున్సిపల్ బిజెపి కౌన్సిలర్ వచ్ పల్లి అర్చన శ్రీనివాస్ ముదిరాజ్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ మున్సిపల్ పాల న, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృ ద్ధి పనుల అమలు, పారదర్శక పరిపాలన, ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధానా లపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైఎస్ చైర్ పర్సన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి.బిజెపి నాయకులు వచ్ పల్లి శ్రీనివాస్ ముదిరాజ్.మున్సిపల్ కౌన్సిలర్ లు పాల్గొన్నారు.






