15 April, 2026 | 12:52 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు శిక్షణ

18-02-2026 12:00 AM

అమనగల్, ఫిబ్రవరి 17( విజయక్రాంతి):  స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉప సర్పంచులు మరియు వార్డు సభ్యులకు మొదటి రోజు శిక్షణా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా, ప్రజా ప్రతినిధులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించేలా ఈ శిక్షణలో పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శిక్షకులు ప్రజా ప్రతినిధులకు ఈ క్రింది విషయాలపై లోతైన అవగాహన కల్పించారు.

పంచాయతీరాజ్ చట్టం 2018 కు సంబంధించిన చట్టంలోని ముఖ్యాంశాలు, సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యుల అధికారాలు, బాధ్యతలు,  తడి చెత్త - పొడి చెత్త వేరు చేయడం, గ్రామాల పరిశుభ్రతలో ప్రజా ప్రతినిధులపాత్ర, ఉపాధి హామీ పథకం లో నర్సరీల నిర్వహణ మరియు పనుల పర్యవేక్షణ గురించి వివరించారు.

 ఆదర్శ గ్రామాల నిర్మాణం, నాయకత్వ లక్షణాలు, పని ఒత్తిడిని అధిగమించడానికి స్ట్రెస్ మేనేజ్మెంట్ మెళకువలు, శిక్షణ కార్యక్రమంలో వివరించారు. గ్రామ అభివృద్ధిలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పని చేసినప్పుడే ఆదర్శ గ్రామాలు సాధ్యపడుతాయని  ఎంపీడీవో కుసుమ మాధురి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీఓ (MPO) లక్ష్మణ్, ఏపీఓ (APO) మాధవరెడ్డితో పాటు ట్రైనర్లుగా ప్రసాద్, చంద్రశేఖర్, రవీందర్ నాయక్ వ్యవహరించారు. మండలంలోని అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు మరియు ప్రజా ప్రతినిధులు ఈ శిక్షణలో చురుగ్గా పాల్గొన్నారు.