18-02-2026 12:00:00 AM
20న బీసీ 14 సంఘాల రాష్ట్ర వ్యాప్త నిరసనలు
హెచ్చరించిన బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణయ్య
ముషీరాబాద్, ఫిబ్రవరి17 (విజయక్రాంతి): బీసీలకు స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు పెంచకుండా పాత పద్ధతిలో 17 శాతానికి తగ్గించి ఎన్నికలకు పోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, రాష్ట్రంలో యుద్ధం జరుగుతుందని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. 42 శాతానికి పెంచకుండా ఎన్నిక లకు వెళితే మంత్రులను తిరగనివ్వం అని, బీసీలను తక్కువ అంచనా వేయొద్దని అన్నా రు.
మంగళవారం నాడిక్కడ 14 బీసీ సంఘాల సమావేశం జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డా.అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ప్రభుత్వ వైఖ రి, భవిష్యత్తుపై ఆందోళన కార్యక్రమంపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వం బలవంతంగా 23న ఎన్నికల నోటిఫికేషన్ వేయడా న్ని తీవ్రంగా అభ్యంతం తెలుపుతూ ఈనెల 20న రాష్ట్ర వ్యా ప్తంగా ధర్నాలు, దక్షాలు, నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
గత సంవత్సరం నుంచి 100 సార్లుకు పైగా జరిపిన ఉద్యమాలకు స్పందించకుండా ప్రభు త్వం బీసీలకు అన్యాయం చేస్తూ ముందుకు వెళుతుందని అన్నారు. దీనిని ఎట్టి పరిస్థితిలో సహించమని హెచ్చరించారు. బీసీ సంఘాల నాయకులను బెదిరించి ఉద్యమాలను తమదారుకి తెచ్చుకుంటూ ఉద్యమా లు నీరు గార్చడానికి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మండి పడ్డారు. బీసీలు ఏకమై 42 శాతం సాధించుకోకపోతే భవిష్యత్తులో సాధించుకోలేమని హెచ్చరించారు. హైకోర్టులో కేసు నడుస్తుండగా ఎన్నికలకు వెళ్లవలసి అవసరం ఏముందని ప్రశ్నించారు.