calender_icon.png 13 January, 2026 | 6:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మకు అక్షరాభ్యాసం

13-01-2026 03:50:41 PM

అమ్మకు అక్షరాభ్యాసం నిర్వహణపై మహిళా సంఘాల సభ్యులకు సిబ్బందికి శిక్షణ

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన సంఘం అధ్యక్షులకు,గ్రామ సంఘ సహాయకులకు మంగళవారం మండల సమాఖ్య కేంద్రంలో శిక్షణ ఇవ్వడం జరిగింది.స్వయం సహాయక సంఘాల్లోని మహిళలందరూ కూడా అక్షరం తెలిసి ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఏవిధంగా నిర్వహించాలి అనే విషయమై సిఆర్పిలు దుర్గ,సంగీత మరియు ఏపిఎమ్ రామాయణ గౌడ్ శిక్షణ ద్వారా తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...సంఘంలోని ప్రతి మహిళకు అక్షరం నేర్పించాలి అనేది తమ లక్ష్యమని ప్రతి మహిళా అక్షరాస్యులుగా ఉండాలని సంకల్పించుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిసిలు దత్తు, రమేష్,నారాయణ,రషీద్,రవి, అకౌంటెంట్ రాజు,ఆపరేటర్ రవి తదితరులు పాల్గొన్నారు.