20 August, 2026 | 9:44 AM

Breaking News

గోడ కూలి కూలీ మృతి.. పోలీసుల దర్యాప్తు   •   పెద్దమల్లారెడ్డికి బస్సు సౌకర్యం.. విద్యార్థులకు ప్రయోజనం   •   ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లను సందర్శించిన మదరోళ్ళ నిఖిల్   •   ఎడపల్లి సింగిల్ విండోలో లక్షల నిధులు దుర్వినియోగం!   •   బెల్లంపల్లి రోడ్డు ప్రమాదం.. కార్మికుడు మృతి   •   షావుకారు జానకికి అస్వస్థత.. ఐసీయూలో చికిత్స   •   కమిషనర్, సానిటరీ ఇన్స్పెక్టర్ వేధింపులకు పాల్పడుతున్నారని కార్మికుల ధర్నా   •   ఆకర్షణీయంగా రైతు బజార్‌ ఏర్పాటు   •   మంథని అభివృద్ధే లక్ష్యం.. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా   •   సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు దుర్మరణం   •  

14 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, 21 మంది భూభారతి ఆపరేటర్ల బదిలీ

12-07-2025 10:36 PM

ఖమ్మం (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన అనుదీప్ దురిశెట్టి రెవెన్యూ శాఖ ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టారు. రెవెన్యూ శాఖ పరిధిలో ఒకే చోట చాలాకాలం నుండి పనిచేస్తున్న 14 మంది కంప్యూటర్ ఆపరేటర్లను, 21 మంది భూ భారతి ఆపరేటర్లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించేందుకు గాను ఎన్నో ఏళ్లుగా ఒకేచోట పని చేస్తున్న వారిని బదిలీ చేస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. రెవెన్యూ శాఖలో సిసిఎల్ఏ పరిధిలో టైపిస్ట్ కం కంప్యూటర్ ఆపరేటర్లు, భూభారతి ఆపరేటర్లుగా పనిచేస్తున్న సిబ్బందిని బదిలీ చేసి రిలీవింగ్, జాయినింగ్ కు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత మండలాల తహసిల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. పాలనలో జవాబుదారీతనం, పూర్తి పారదర్శకత దిశగా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖలో అన్ని స్థాయిల అధికారులు, సిబ్బంది విధుల్లో అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రజలకు న్యాయం చేకూర్చాలనే నిబద్ధతతో నిర్వర్తించాలని కలెక్టర్ అన్నారు.