12-07-2025 10:40:25 PM
జిల్లా రెవెన్యూ అదన కలెక్టర్ మధుసూదన్ నాయక్..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): వచ్చిన ఫిర్యాదులను ప్రత్యేకంగా పరిశీలించి పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్(Additional Collector Madhusudhan Naik) ఆదేశించారు. శనివారం జిల్లాలోని మహబూబ్ నగర్ అర్బన్, రూరల్, కోయిల్ కొండ, హన్వాడ, మహమ్మదాబాద్, నవాబ్ పేట, బాలా నగర్, జడ్చర్ల మండల తహశీల్దార్ కార్యాలయంలను రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆకస్మిక తనిఖీ చేసి భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారం, రేషన్ కార్డులు జారీకి విచారణ, సి.ఎం. ప్రజావాణి దరఖాస్తులు, ఓటర్ జాబితాలో మార్పులు, చేర్పులు దరఖాస్తులు పెండింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు.
భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు ఎన్ని వచ్చాయి, ఏ సమస్యల పై వచ్చాయి. వాటి పరిష్కారంపై నోటీస్, విచారణ చేసి త్వరగా పరిష్కారం చేయాలని పేర్కొన్నారు. సి.ఎం. ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలని ఆదేశించారు. తహశీల్దార్ లాగిన్ లో ఉన్న రేషన్ కార్డు దరఖాస్తులు క్షేత్ర స్థాయి విచారణ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటర్ జాబితాలో మార్పులు చేర్పులు,నమోదు దరఖాస్తులు బి.ఎల్. ఓ.లు,సూపర్వైజర్ లు త్వరగా విచారణ చేసి పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.