calender_icon.png 13 July, 2025 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల సంక్షేమానికి పెద్దపీట

12-07-2025 10:33:23 PM

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి..

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) అన్నారు. శనివారం జమాతే ఇస్లాం హింద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళలు ఎమ్మెల్యేని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం మాత్రమే పనిచేస్తుందన్నారు. ఈ సంవత్సరం మహబూబ్ నగర్ పట్టణంలో 1500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. మళ్లీ వచ్చే సంవత్సరం 1500 ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని చెప్పారు. స్థలం లేనివారు ఇంటికోసం 40,50 గజాల స్థలాన్ని కొని పెట్టుకోవాలని సూచించారు.

మహిళల కోసం వీరన్నపేటలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రెండు మూడు రోజుల్లో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో వహిదా పోరాటం చేశారని తెలిపారు. తన కోసం కాకుండా మహిళల కోసం వారి హక్కుల కోసం ఆమె పనిచేస్తారని చెప్పారు. మహిళలు ప్రార్థనల కోసం స్థలం కావాలని వారు ఎమ్మెల్యేని అడుగగా సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బిసి మహాసభ మహిళా కార్యదర్శి వహిదా బేగం, తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు మెట్టుకాడి ప్రభాకర్ తదితరులు ఉన్నారు. 

విద్యానిధికి విరాళం..

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ని క్యాంపు కార్యాలయంలో కలిసి మహబూబ్ నగర్ విద్యా నిధికి మున్నూరు కాపు ఉద్యోగుల రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సభ్యులు రూ 12, 600 చెక్కును  అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని అభినందించారు. ఈ  కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దుంకుడు శ్రీనివాస్, సంఘం ప్రధాన కార్యదర్శి కోరమోని శ్రీనివాసులు, ప్రచార కార్యదర్శి పాశం గోపాల్, ఉపాధ్యక్షులు గోనెల వెంకటేశ్వర్లు సంయుక్త కార్యదర్శి ఎం నర్సిరెడ్డి, ముద్దనూరు సదానంద్, పాకాల వెంకటయ్య, రాయల రమేష్, కార్యదర్శులు కోరమోని వెంకటయ్య, కార్యవర్గ సభ్యులు  చంద్రకాంత్, ఆంజనేయులు, మాడ మురళీకృష్ణ, దానం రవీందర్ తదితరులు పాల్గొన్నారు.