16 June, 2026 | 1:49 AM

20 మంది ఐఏఎస్‌ల బదిలీ

16-06-2024 12:47 AM

20 జిల్లాల కలెక్టర్లకు స్థానచలనం.. త్వరలో ఐపీఎస్‌ల బదిలీలు?

హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): తెలంగాణ పరిపాలన విభాగంలో భారీ కుదుపులు చోటుచేసుకున్నాయి. 20మంది కలెక్టర్లను సర్కారు బదిలీ చేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అత్యధికంగా ఖమ్మం జిల్లా నుంచి బదిలీ అయ్యారు. జిల్లా కలెక్టర్‌తో పాటు, అదనపు కలెక్టర్, కమిషనర్ ఇతర జిల్లాలకు పరిపాలన అధికారులుగా నియామకమయ్యారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత పరిపాలన ప్రక్షాళనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు.

ఈ నేపథ్యంలోనే తాజా బదిలీలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బదిలీలు ఉంటాయని భావించినా.. లోక్‌సభ ఎన్నికలు అడ్డుగా మారాయి.  ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేకపోవడంతో పాలనపై దృష్టిసారించేందుకు భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. మొదట జిల్లాల కలెక్టర్లకు స్థాన చలనం కలిగించింది. త్వరలో ఐపీఎస్‌ల బదిలీలు కూడా ఉంటాయని ఉన్నతాధికారుల్లో చర్చ జరుగుతోంది.  ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే జాబితా సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. 

 పేరు ప్రస్తుతం కలెక్టర్‌గా 

పనిచేస్తున్న పోస్టు బదిలీ అయిన జిల్లా 

ముజామిల్ ఖాన్ పెద్దపల్లి, కలెక్టర్ ఖమ్మం

బడావత్ సంతోష్ మంచిర్యాల, కలెక్టర్ నాగర్‌కర్నూలు

సందీప్‌కుమార్ ఝా ట్రాన్స్‌కో జేఎండీ రాజన్న సిరిసిల్ల

అనురాగ్ జయంతి సిరిసిల్ల, కలెక్టర్ కరీంనగర్ 

ఆశిష్ సాంగ్వాన్ నిర్మల్, కలెక్టర్ కామారెడ్డి

జితేష్ వీ పాటిల్ కామారెడ్డి, కలెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం

రాహుల్ శర్మ వికారాబాద్, అదనపు కలెక్టర్ జయశంకర్ భూపాలపల్లి 

సిక్తా పట్నాయక్ హన్మకొండ, కలెక్టర్ నారాయణపేట్

కోయ శ్రీహర్ష నారాయణపేట్, కలెక్టర్ పెద్దపల్లి

ప్రావీణ్య వరంగల్, కలెక్టర్ హన్మకొండ

సత్యప్రసాద్ ఖమ్మం, అదనపు కలెక్టర్ జగిత్యాల

విజయేంద్ర బోయి ప్రత్యేక కార్యదర్శి,  టీఆర్‌అండ్‌బీ మహబూబ్‌నగర్

దీపక్ నాగర్‌కర్నూలు, అదనపు కలెక్టర్ మంచిర్యాల

ప్రతీక్ జైన్ ఐటీడీఏ పీఓ, భద్రాచలం వికారాబాద్

నారాయణరెడ్డి వికారాబాద్, కలెక్టర్ నల్లగొండ

ఆదర్శ సురభి ఖమ్మం, కమిషనర్ వనపర్తి

తేజస్ నందలాల్ పవార్ వనపర్తి, కలెక్టర్ సూర్యాపేట

సత్య శారదా దేవి జాయింట్ సెక్రటరీ, అగ్రికల్చర్ వరంగల్

టీఎస్ దివాకర జగిత్యాల, అదనపు కలెక్టర్ ములుగు

అభిలాష అభినవ్ జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ నిర్మల్