11 April, 2026 | 2:07 AM

ఎక్సుజ్‌లో 1,912 మంది బదిలీ

11-04-2026 12:00 AM

హైదరాబాద్, ఏప్రిల్ 10(విజయక్రాంతి): ఎక్సైజ్ శాఖలో హెడ కానిస్టేబుల్, కానిస్టేబళ్ల బదిలీల ప్రక్రియ పూర్తియింది. 326 హెడ్ కానిస్టేబుళ్లు, 1,586 మంది కానిస్టేబుళ్లు కలిపి మొత్తం 1,912 మందిని బదిలీ చేస్తూ ఎక్సైజ్ శాఖ కమిషనర్ హరికిరణ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ ఉత్తర్వులు అందుకున్న వారు మూడు రోజుల్లో ఆయా స్థానాల్లో  చేరాలని కమిషనర్ ఆదేశించారు.

జనవరి 31 వరకు రెండు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన వారిని సీనియార్టీ పరంగా బదిలీ చేసిన్నట్లు ఆయన తెలిపారు. కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ల బదిలీలతో ఎక్సైజ్ స్టేషనల్లో పరిపాలన, సేవల నాణ్యతలో మెరుగైన ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. ఎనిమిదేళ్ల అనంతరం బదిలీల ప్రక్రియ ఇప్పుడు జరిగిందన్నారు. బదిలీల ప్రక్రియ విజయవంతంగా ముగిసినందున డిప్యూటీ కమిషనర్లు, సూపరెండెంట్లను కమిషనర్ హరికరణ్ అభినందించారు.