calender_icon.png 8 July, 2025 | 10:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారదర్శకంగా ప్లాట్ల పంపిణీ

08-07-2025 01:07:30 AM

జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి 

కందుకూరు, జులై 7 : ఫ్యూచర్ సిటీలో ఫార్మా బాధిత రైతులకు పారదర్శకంగా లాటరీ పద్ధతిలో ప్లాట్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభించామని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. ప్రభు త్వ హామీలో భాగంగా ఫార్మా లో భూములు కోల్పోయిన భూనిర్వాసితులకు వంద శాతం హక్కులతో కూడిన ప్లాట్లను పంపిణీ చేస్తుందని ఆయన చెప్పారు.

సోమవారం కందుకూరు మండలం మీర్ఖాన్ పేట్ రెవెన్యూలో ఏర్పాటు చేసిన లేఅవుట్లో యాచారం, కందుకూరు మండలాల పరిధిలోని 7 గ్రామాలకు చెం దిన భూనిర్వాసితులకు లబ్దిదారుల చేతుల మీదుగా లాటరీ ద్వారా ప్లాట్లను కేటాయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని సదుపాయాలతో లేఅవుట్ను రూపొందించి ప్ర భుత్వం రైతులకు విలువైన స్థలాలను అందిస్తుందన్నారు.

ప్లాట్లు పొందిన బాధిత రైతులకు రూ పాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరిస్తూ రిజిస్ట్రేషన్ సైతం చేసి ఇస్తుందని తెలిపారు. ఇదే లేఅవుట్ నుంచి భవిష్యత్తులో రేడియల్ రోడ్డు వస్తోందని, రైతులు ఎవరూ ప్లాట్లను అమ్ముకోవద్దని కలెక్టర్ సూచించారు. అనంతరం కలెక్టర్ అక్కడే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. మొదటి రోజు 670 మంది రైతులకు లాటరీ ద్వారా ప్లాట్లను కేటాయించారు.

కార్యక్రమంలో టీజీఐఐసీ (తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ) యం.డీ. కె.శశాంక, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డిసిపి సునీత రెడ్డి, ఆర్డీఓలు జగదీశ్వర్రెడ్డి, అనంతరెడ్డి, డీపీఓ సురేష్ మోహన్, సంబంధిత అధికారులు, తదితరులుపాల్గొన్నారు.