08-07-2025 01:06:45 AM
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, జూలై 7 (విజయక్రాంతి): గీత కార్మికుల సంక్షేమంలో భాగంగా ప్రభు త్వం అందిస్తున్న కాటమయ్య రక్షా కిట్ల ద్వా రా 80 శాతం వరకు ప్రమాదాలను నివారించవచ్చని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్, మంచిర్యాల, బెల్లం పల్లి ఆర్డీవోలు శ్రీనివాస్ రావు, హరికృష్ణ, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎ.పురుషోత్తంలతో కలిసి గౌడ కుల స్తులకు కాటమయ్య రక్షా కిట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం గౌడ కులస్తుల సంక్షేమం లో భాగంగా కాటమయ్య రక్షా కిట్లను పం పిణీ చేస్తుందని తెలిపారు. కాటమయ్య రక్షా కిట్ల ద్వారా 80 శాతం వరకు ప్రమాదాలు తగ్గాయని, కాటమయ్య రక్షా కిట్లపై శిక్షణ పూర్తి చేసుకొని అర్హత పొంది 19 మంది గౌడ కులస్తులకు కిట్లను పంపిణీ చేయడం జరిగిందని, కాటమయ్య రక్షా కిట్లను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్య క్రమంలో ఆబ్కారీ- మద్యనిషేధ శాఖ సి.ఐ. సమ్మయ్య, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి సురేష్, నరేష్, శ్రీధర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.