సొంత బిడ్డల్లా చూసుకోండి
జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
మహబూబ్‌నగర్ ఆగస్టు 13 (విజయక్రాంతి): విద్యార్థులను సొంత బిడ్డలా చూసుకోవాలని జిల్లా అదరపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. గురువారం జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చేపడుతున్న సివిల్ పనుల పురోగతిపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ సమీక్ష నిర్వహించారు.
కె.జి.బి.విల్లో కొనసాగుతున్న పనులతో పాటు పెండింగ్లో ఉన్న పనుల పురోగతిని సమీక్షించారు. పెండింగ్లో ఉన్న సివిల్ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పనులు ఆలస్యం కాకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి, నిర్దేశిత సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఇంజినీర్లు, కె.జి.బి.వి ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.






