పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో జిల్లాకు అన్యాయం
బీజేపీ నేతలు సుదర్శన్ రెడ్డి
మేడ్చల్, ఆగస్టు 13 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఉద్యోగాలకు సంబంధించి జారీచేసిన నోటిఫికేషన్ లో జిల్లాకు అన్యాయం జరుగుతోందని బిజెపి మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి ఏనుగు సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తిరుమల్ రెడ్డి తెలిపారు. జిల్లా ప్రెస్ క్లబ్ లో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి మేడ్చల్ హైదరాబాద్ యాదాద్రి భువనగిరి జిల్లాల నిరుద్యోగులకు అవకాశం లేదన్నారు.
దీనివల్ల జిల్లాలోని వేలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవడం లేదన్నారు. ఇతర జిల్లాల్లో నాన్ లోకల్ కింద కేవలం ఐదు శాతం మాత్రమే కోట ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దగా ఉద్యోగాలు ఇవ్వడం లేదని, పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసి నిరుద్యోగులకు అందరికీ అవకాశం లేకుండా చేస్తుందని వారు విమర్శించారు.
ఎన్నికల ముందు ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మేడ్చల్ జిల్లాకు కూడా అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.






