21 May, 2026 | 2:42 AM

సంధి, వ్యూహం, ఆధిపత్య ధోరణులు

20-05-2026 12:00 AM

తుల్య కాలఫలోదయే వా క్షయే 

సంధి ముపేయాత్..

(కౌటిలీయం 7

దేశ ప్రజల సమగ్ర వికాసం, ఆర్థిక ప్రగతియే పాలకులకు ప్రాధాన్య తాంశాలు. ఇందులో ఇసుమంత ఏమరుపా టును ప్రదర్శించినా మరొక దేశం దెబ్బతీ సేందుకు పక్కలో బల్లెంలా సన్నద్ధంగా ఉం టుంది. అందుకే పాలకుడు నిత్యం తన బ లాబలాలను, శత్రువు శక్తిసామర్థ్యాలను బేరీ జు వేసుకుంటూ..  ఎదుటివారి కన్నా తాను బలవంతుడవడం లేదా దుర్బలు డవడం గుర్తించి.. తదనుగుణంగా సంధి చేసుకోవా లో లేదా యుద్ధం చేయాలో నిర్ణయించుకోవాలి.

తన ప్రగతికి ఉపయుక్తమైన విధానా న్ని వృద్ధి అన్నారు.. తనకు ఉపకరించని విధానాన్ని క్షయము అన్నారు. శత్రువుకూ, తనకూ వృద్ధి లేదా క్షయం సమానంగా ఉన్నప్పుడు సంధి చేసుకోవడం ఉత్తమమం టారు ఆచార్య చాణక్య. ఒకప్పుడు యుద్ధా లు సైనిక పాటవంపైనా ఆధారపడి ఉండేవి. ఇప్పుడవి ఆర్థిక యుద్ధాలుగా మారాయి.  చాణక్య పేర్కొన్న వృద్ధి, క్షయం, సంధి లాంటి భావనలకు మహాభారతంలో అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. ఒకప్పుడు ర ణక్షేత్రంలో కత్తులు, బాణాలు, రథాలను ఉ పయోగించినా, యుద్ధాలకు ముందుగా ఆర్థిక శక్తిని, ధనధాన్య నిలువలు పెంచుకోవ డం, మిత్ర రాజ్యాల సహాయాన్ని పొందడం, వాణిజ్య మార్గాలు, ప్రజాభిమానం, దౌత్యం వంటి అంశాలకు అత్యంత ప్రాధాన్యతనివ్వ డం స్పష్టంగా కనిపిస్తుంది.

ధర్మరాజు చేసిన రాజసూయ యాగం ధార్మిక యాగంగానే భావించలేం. తద్వారా తాము కొత్తగా స్థాపించిన అధికారం.. ప్రపం చంపై రాజకీయ, ఆర్థిక ఆధిపత్యాన్ని పరోక్షంగా సాధించిన ప్రక్రియగా చూడవచ్చు. యా గానికి వచ్చిన రాజులు కట్టిన పన్నులు, ఇచ్చి న కానుకలు ధర్మరాజు ఔన్నత్యాన్ని వివిధ దేశాధిపతులు అంగీకరించిన విధానానికి ప్రతీకగా భావించాలి.

కృష్ణుని సహకారంతో వారు నిర్మించిన ఇంద్రప్రస్థం.. వనరులు, వసతులు లేని అరణ్యాన్ని వాణిజ్య, రాజకీయ కేంద్రంగా తీర్చిదిద్దిన వైనం కనిపిస్తుంది. ఇంద్రప్రస్థం ఆ కాలంలో శక్తివంతమైన ఆర్థి క కేంద్రంగా, ప్రపంచ రాజకీయాలను ప్రభా వితం చేసిన రాజ్యంగా కనిపిస్తుంది. దానితో సంపద పెరిగింది, ప్రజలకు వసతులు, వన రులు సమకూరాయి, మిత్రరాజ్యాలూ ఏర్ప డ్డాయి. దీన్నే ఆధునికంగా అంతర్జాతీయ ప్ర మాణాలకు అనుగుణమైన వేదికగా మౌలిక వనరుల కల్పనకు శ్రీకారం చుట్టబడిందని చెప్పుకోవచ్చు.

ప్రత్యక్ష యుద్ధానికి కాలుదువ్వకుండా పాండవుల గౌరవాన్ని, సంపదను, రాజ్యా న్ని, మానవ, ఆర్థిక వనరులను హరించి ప్రత్యర్థిని బలహీనుని చేసిన విధానం జూద ప్రక్రియలో కనిపిస్తుంది. పాండవులను అడ వికి పంపడమనేది దాదాపుగా శత్రుదే శాల పై ఆర్థిక ఆంక్షలు విధించి వారి వ్యాపారాన్ని తద్వారా ప్రాభవాన్ని తగ్గించడంగా భావించవచ్చు. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం, మిత్రుత్వం ఉండవు.

తమతమ ప్రయోజ నా లే అంతిమం. ఎవరు ఎవరితో ఉన్నారు.. ఉంటారు? ఎవరెవరి వనరులు, వ్యాపార వాణిజ్యాల పరిమితులు ఎంత? ఆర్థిక స్తో మత, కొనుగోలు శక్తి ఎంత? ఎవరె వరి అ ధునాతన ఆయుధ సంపత్తి ఎంత? అది మ నకెలా ఉపయుక్తమవుతుంది.. ఇవే ప్రాతిప దికగా వ్యూహాత్మక మైత్రి కాని, శత్రుత్వం కాని చేయడం కనిపిస్తుంది. ఇదే విధానం మనకు కురుక్షేత్ర సంగ్రామానికి ముందు కౌ రవ, పాండవుల సమీక్షలో కనిపిస్తుంది.

అలాగే అన్ని ప్రయత్నాలు చేసినా ఆవలి వ్యక్తులు సహకరించని సమయంలో తాము పూర్తిగా తగ్గి సంపూర్ణ మానవ, ఆర్థిక వినాశాన్ని నివారించేందుకు, భవిష్యత్ యువ శక్తిని, వనరులను కాపాడుకునేందుకు ప్రయత్నించిన పరిణత రాజకీయ విధానానికి.. కృష్ణరాయబారంలో ఐదు గ్రామాలిచ్చినా సం ధి చేసుకుంటామనే ప్రతిపాదన ప్రతీకగా ని లుస్తుంది. నిజానికది పాండవుల బలహీన త కాదు, వ్యూహాత్మక సంధి ప్రయత్నం. సం ధి జరిగి తాము అధికారాన్ని చేపడితే అనతి కాలంలోనే ఆర్థిక నియంత్రణ, మిత్రరాజ్యా ల సమీకరణ, వనరుల పరిరక్షణ, ప్రజల స హాయం, దౌత్య సంబంధాల విస్తరణ లాంటి చర్యల వల్ల సామ్రాజ్య పునర్నిర్మాణం జరు గుతుందని ధర్మరాజు ఆలోచన.

కాలమేదైనా ఘర్షణలు, యుద్ధాలు మా నవ వనరులను, ఆర్థిక ప్రగతిని నశింప జేస్తాయి. శాంతిచర్చలు, కాల్పుల విరమణ లు, వాణిజ్య ఒప్పందాలు.. ఇలాంటివి బంధాలను పెంచుకునే సాధనాలు. పరస్పర వినాశనం కన్నా విజయ సాధన ఎప్పుడైనా చిన్నదే. ఎక్కడో జరిగే యుద్ధం అక్కడికే పరిమితం కాదు. ఇరాన్, ఇజ్రాయెల్ అమెరికాల మధ్య యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసింది. చమురు లభ్యత తగ్గింది, ధరలు పెరిగిపోయాయి.

సాంకేతిక నియంత్రణ, డేటా ఆధిపత్యం, వాణిజ్య ఒప్పందాలు, కరెన్సీ ప్రభావం.. కొత్త విధానాలకు ఆకృతి నిచ్చాయి. ప్రతి దేశానికీ వారి రక్షణ ఒప్పం దాలు, వాణిజ్య కూటములు, ఇంధన భాగ స్వామ్యాలు, సాంకేతిక సహకారాలు ఇవే ప్రధానంగా తమతమ భద్రతను బలోపేతం చేసుకునే ప్రాధాన్యతాంశాలుగా, ఆయా దేశాల ప్రయోజనాలకు అద్దం పడుతూ అం తర్జాతీయ రాజకీయ బంధాలలో ప్రతిబిం బిస్తుంటాయి.

పంచతంత్రంలో ‘కాకులు- గుడ్లగూబలకు‘ సంబంధించిన కథ ఒకటి కనిపిస్తుంది. ఒక అడవిలో కాకులకు, గుడ్లగూబలకు చాలాకా లంగా శత్రుత్వం ఉండేది. కాకులు పగటివేళ, గుడ్లగూబలు రాత్రివేళ ఆధిపత్యాన్ని చాటేవి. గుడ్లగూబలు రాత్రివేళ నిద్రావస్థలో ఉన్న కాకులపై దాడిచేయడం వల్ల కాకులు క్షీణ దశకు చేరుకున్నాయి. ఆ నేపథ్యంలో కాకు లు పెట్టుకున్న సమావేశంలో కాకుల మంత్రి ‘శత్రువు బలంగా ఉన్నప్పుడు ప్రత్యక్ష యుద్ధం కంటే సంధి, మాయ, వ్యూహమే ఉత్తమం అన్నాడు.

రాజు కాదన్నాడు. రాజు తో మంత్రి విభేదించినట్లుగా నటించి గుడ్లగూబల వద్ద ఆశ్రయం కోరాడు. మొద ట్లో అనుమానించినా చివరకవి ఆశ్రయం ఇచ్చాయి. కొంతకాలం నమ్మకస్థునిగా నటిం చిన మంత్రి కాకి గుడ్లగూబల గుహల నిర్మా ణం, బలహీనతలు, ప్రవేశ మార్గాలు అన్నీ గమనించింది. చివరగా ఒకరోజు పగటి సమయంలో గుడ్లగూబలు నిద్రిస్తున్న సమయంలో కాకులకు సమాచారం ఇచ్చి గుహల వద్ద నిప్పు పెట్టించింది.. దానితో గుడ్లగూబలు బయటపడలేక నశించాయి.

ప్రత్యక్ష యుద్ధం కన్నా వ్యూహాత్మక సంధి, సమాచార సేకరణ ముఖ్యమని చెప్తుంది, పంచతంత్రం. శత్రువు బలంగా ఉన్నప్పుడు తాత్కాలికంగా తగ్గడం బలహీనత కాదు.. శత్రువు అంతర్గత వ్యవస్థను సమగ్రంగా తెలుసుకొని సరైన సమయాన్ని ఎంచు కోవడం ద్వారా విజయం సాధించాలే కాని ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకూడదు.

ఈ నాడు ప్రపంచ దేశాలు చాలావరకు ప్రత్య క్ష యుద్ధం చేయకుండానే గూఢచర్యం, ఆర్థికం గా ఏకాకిని చేసి ఒత్తిడిని పెంచడం, సైబర్ దాడుల ద్వారా రహస్యాలను దొం గిలించ డం, అంతర్గతంగా విభేదాలను సృష్టించడం ద్వారా ప్రత్యర్థులను బలహీ నపరుస్తున్నా యి. శత్రువుతో తాత్కాలిక సంధి చేసుకోవ డం, వ్యూహాత్మకంగా మౌనంగా ఉండడం, మైత్రిని నటించడం కూడా అంతర్జాతీయ రాజకీయాలలో చూస్తున్నాం. నిజానికి చాణ క్య నుంచి నేటి వరకూ యు ద్ధాల రూపాలు మారినా, రాజనీతి స్వభావం మాత్రం మా రలేదు అన్నది సత్యం.

పాలకుర్తి రామమూర్తి