13-07-2025 01:06:49 AM
మెదడు, వెన్నెముక గాయాలు ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. వికలాంగతకు, మరణానికి కూడా ఈ గాయాలు దారితీసే అవకాశం ఉంది. ఈ గాయాలు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు, పొడవటం, పడిపోవడం లేదా క్రీడలు ఆడే సమయంలో కలుగుతాయి.
మెదడు గాయాలు: మెదడు గాయాలను తేలికపాటి, మధ్యమ, తీవ్రమైన మెదడు గాయంగా వర్గీకరించవచ్చు.
తేలికపాటి మెదడు గాయాలు
ఇది తాత్కాలికంగా మెదడు కణాలు పనిచేయకపోవటానికి కారణమవుతుంది. ఫలితంగా, ఫిట్స్, మైకం, తల తిరగడం, తలనొప్పి, జ్ఞాపక నష్టాలు (అమెషియా) వంటివి ఉంటాయి. సాధారణంగా కొన్ని రోజులు లేదా వారాల్లో విశ్రాంతితో తగ్గిపోతాయి. అయితే పునరావృతమైన కన్కషన్లు మెదడుపై దీర్ఘకాలిక ప్రభావం చూపవచ్చు.
మధ్యమ లేదా తీవ్రమైన మెదడు గాయాలు
అత్యవసర వైద్యం అవసరం చేసే గాయా లు. రక్తస్రావం, కపాల విరగడం లేదా మెదడు కణజాలాల చెరిగిపోవడానికి కారణమవుతాయి. అవి స్పృహ కోల్పోవడం, ఫిట్స్, జ్ఞాపకశక్తి అంతరాయా లు, శారీరక వికలాంగతలకు దారితీయవచ్చు.
చికిత్స: ట్రామాటిక్ బ్రెయిన్ గాయాలకు చికిత్స లక్ష్యం రక్తస్రావం, వాపు, తక్కువ ఆక్సిజన్ సరఫరా వల్ల వచ్చే మరిన్ని నష్టాలను నివారించడం, ఫిట్స్ నివారించడానికి, నొప్పిని తగ్గించడానికి, మెదడులో వాపు తగ్గించడానికి మందు లు ఇవ్వబడతాయి. అత్యవసర శస్త్రచికిత్సలు రక్తపు గడ్డను (హెమటోమాను)
తొలగించడం: మెదడులో లేదా చుట్టూ రక్తస్రావం కలిగితే ఒత్తిడికి తీస్తుంది. కపాల విరిగిన భాగాలను సరిచేయడం
ఒత్తిడిని తగ్గించడానికి: అధిక సెరెబ్రోస్పానియల్ ఫ్లూయిడ్‌ను తొలగించడం లేదా మెదడుకు కల్పించడానికి కపాలలో రంధ్రం చేయడం.
రిహాబిలిటేషన్: మెదడు గాయాలైన వ్యక్తు లు సాధారణ జీవితం వైపు మళ్లేందుకు దీర్ఘకాలిక రిహాబిలిటేషన్ అవసరం అవుతుంది. నడక లేదా మాట్లాడటం వంటి ప్రాథమిక పనులను తిరిగి నేర్చుకోవడం ఇందులో ఉండవచ్చు.
వెన్నెముక (స్పున్) గాయాలు: వెన్నెముక గాయాలు మెదడు, శరీరం మధ్య సం బంధాన్ని అంతరించజేస్తాయి. వాపు, రక్తస్రావం లేదా ద్రవం పేరుకుపోవడం వ ల్ల అదనపు నష్టం జరగవచ్చు. వాటివల్ల శరీరంలో కింది భాగాల కదలిక, భావం మరియు ఇతర శరీర క్రియలపై తాత్కాలిక లేదా శాశ్వత ప్రభావం పడవచ్చు.
మెడ గాయాలు: నాలుగు అవయవాలలో బలహీనత (క్వాడ్రిప్లీజియా). మెడ కింది భాగాల గాయాలు -కాళ్లలో బలహీనత (పాఠాప్లీజియా) వెన్నెముక గాయాలు భావం, గుండె, ఊపిరితిత్తులు, మలమూత్ర నియంత్రణ, లైంగిక కార్యక లాపాలపై ప్రభావం చూపుతాయి.
గాయాల నివారించేందుకు జాగ్రత్తలు:
- వాహనాలు నడుపుతున్నపుడు లేదా క్రీడలు ఆడేప్పుడు హెల్మెట్ ధరించడం, డ్రైవర్, ప్రయాణికులు సీటు బెల్ట్ ధరించడం, మద్యం సేవించకుండా, మొబైల్ ఉపయోగి చంకుండా డ్రైవింగ్ చేయడం చాల ఉత్తమమైనది.