25 August, 2026 | 2:01 PM

సెమీస్‌లో గాయత్రి జోడీ ఓటమి

02-06-2024 12:32 AM

సింగపూర్: సింగపూర్ ఓపెన్‌లో భారత డబుల్స్ ద్వయం పుల్లెల గాయత్రి గోపిచంద్ జాలీ పోరాటం ముగిసింది. సూపర్ ఫామ్‌తో వరుస మ్యాచ్‌ల్లో గెలుస్తూ వచ్చిన గాయత్రి జంట కచ్చితంగా టైటిల్ గెలుస్తారని భావించినప్పటికీ నిరాశే మిగిలింది. శనివారం బీడబ్ల్యూఎఫ్ సూపర్ టోర్నీ మహిళల డబుల్స సెమీ ఫైనల్లో గాయత్రి జంట 21 11 నామి మత్యుయమా షిడా ద్వయం (జపాన్) చేతిలో ఓటమి పాలైంది. వరుసగా టాప్ ప్లేయర్లను మట్టికరిపించిన గాయత్రి జోడీకి సెమీస్‌లో మాత్రం చుక్కెదురైంది. 47 నిమిషాల పాటు సాగిన పోరులో గాయత్రి ప్రతిఘటించడంలో విఫలమై ప్రత్యర్థికి తలవంచారు.