16 July, 2026 | 1:42 AM

ఖో- ఖో జట్టుకు గిరిజన బిడ్డ ఎంపిక

16-07-2026 01:32 AM

హర్షం వ్యక్తం చేసిన తండావాసులు

గరిడేపల్లి, జూలై 15 :మండల పరిధిలోని గారకుంట తండాకు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన గిరిజన బిడ్డ క్రీడాకారిణి గుగులోతు శైలజ ఖో ఖో పోటీలలో ప్రతిభ చాటి ఉన్నత స్థాయికి ఎంపికయ్యారు. పంజాబ్ లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో జరగబోయే పోటీలకు ఆమె ఎంపిక కావడం పట్ల స్థానికులు, ప్రముఖులు వర్షం వ్యక్తం చేశారు.

గార కుంట తండా కు చెందిన నిరుపేద గిరిజన దంపతులు గుగులోతు జలంధర్ పద్మల కుమార్తె అయిన శైలజ చిన్నతనం నుంచి ఆటలపై ఆసక్తితో కష్టపడి ఈ స్థాయికి ఎదిగినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గుగులోతు నీలా హేముల నాయక్, ఎస్టీ సెల్ గుగులోతు సందీప్ నాయక్,సామాజికవేత్త నరేందర్ నాయక్, మాజీ విద్యా కమిటీ చైర్మన్ కోటయ్య, వార్డు మెంబర్లు శ్రీనివాస్,రవీందర్ నాయక్, నరసింహ నాయక్, నాగు నాయక్, నెహ్రూ నాయక్, లాలు నాయక్, తదితరులు పాల్గొన్నారు.